Breaking | గచ్చిబౌలిలో కాల్పుల కలకలం…
హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలిలో కాల్పుల ఘటన కలకలం రేపింది. పోలీసులపై ఓ దొంగ కాల్పులు జరిపాడు. పబ్‌కు వచ్చిన దొంగను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా.. దొంగ రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఈ క్రమంలో కానిస్టేబుల్ వెంకటరెడ్డి, పబ్ బౌన్సర్లకు గాయాలయ్యాయి. చివరకు పోలీసులు దొంగను అరెస్ట్ చేశారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.