OLD WOMEN | ఫ్రెండ్లీ పోలీస్..

OLD WOMEN | ఫ్రెండ్లీ పోలీస్..

OLD WOMEN | నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్ర ప్రభ : పోలీసుల్లో మానవత్వం పరిమళించింది. ఓటు హక్కును వినియెగించుకోవడానికి వస్తున్న వృద్ద మహిళా పై సానుభూతి చూపించారు. ఆమెను ఎత్తుకొని వెళ్లి తన పోలీసు (Police) వాహనంలో కూర్చో బెట్టి పోలింగ్ కేంద్రానికి తరలించిన సంఘటన జరిగింది. నాగర్ కర్నూల్ జిల్లా తూడుకుర్తిలో నేడు జరుగుతున్న రెండో విడత ఎన్నికల్లో పోలీస్ అధికారుల తీరు చాలా గొప్పగా కన్పించింది.

OLD WOMEN

అసలు విషయం ఏమిటంటే.. తుడుకుర్తి గ్రామంలో ఓటు హక్కు (right to vote) వినియోగించుకునేందుకు చాలా కష్టంగా నడవడానికి ఇబ్బంది పడుతున్న వృద్ధురాలిని నాగర్ కర్నూల్ ఆర్ ఎస్ ఐ గౌస్ పాషా స్వయంగా పోలీస్ వాహనంలో ఎక్కించి పంపించారు. ఇది చూసిన అక్కడి ప్రజలు శభాష్‌ పోలీస్ అంటూ అభినందించారు. అందరూ ఇలాగే ఫ్రెండ్లీ పోలీస్ గా ఉండాలని కోరుకుంటున్నారు.

Leave a Reply