Oath-taking | తమిళనాడు సీఎం విజయ్..

Oath-taking | తమిళనాడు సీఎం విజయ్..

Oath-taking | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : తమిళ రాజకీయాల్లో సినీ నటుడు విజయ్ కొత్త చరిత్ర సృష్టించారు. ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చిన ఆయన, తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి రాహుల్ గాంధీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. చెన్నైలో జరిగిన ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో అభిమానులు, పార్టీ కార్యకర్తలు, ప్రముఖులు హాజరయ్యారు. అయితే.. ఈ వేడుకలో త్రిష స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.

సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన విజయ్, తక్కువ సమయంలోనే ప్రజల్లో బలమైన మద్దతు సంపాదించుకున్నారు. ఎన్నికల ప్రచారంలో ఆయన చేసిన హామీలు, యువతతో ఏర్పరచుకున్న అనుబంధం విజయానికి కీలకంగా మారినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. విజయ్ సీఎం కావడంతో అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్నారు. పలు చోట్ల భారీ కటౌట్లు ఏర్పాటు చేసి, మిఠాయిలు పంచుతూ ఆనందం వ్యక్తం చేశారు. తమిళ రాజకీయాల్లో ఇది కొత్త శకానికి నాంది అని పార్టీ నేతలు పేర్కొంటున్నారు.

Leave a Reply