కడెం తహసీల్దార్ కు సన్మానం

కడెం, ఆంధ్రప్రభ : కడెం మండల నూతన తహసీల్దారుగా బాధ్యతలు స్వీకరించిన ఖాజా మొయినుద్దీన్‌ను మండలంలోని మీ సేవా కేంద్రాల నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఆయనకు శాలువాలు కప్పి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మీ సేవా కేంద్రాల నిర్వాహకులు గట్ల శ్రీనివాస్, ఇస్లావత్ రాజేష్, ఇస్లావత్ రాజేందర్, భూషణ వేణి, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
