2 kg of cannabis | ఐదుగురిపై కేసు నమోదు

2 kg of cannabis | నర్సీపట్నం, ఆంధ్రప్రభ : గంజాయిని లిక్విడ్ రూపంలోకి మార్చి హాషిష్ ఆయిల్‌గా సరఫరా చేస్తున్న ఐదుగురు యువకులను గొలుగొండ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి భారీ మొత్తంలో హాషిష్ ఆయిల్, గంజాయి, ద్విచక్ర వాహనాలు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

నర్సీపట్నం డీఎస్పీ పోతిరెడ్డి శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. ఏటిగైరంపేట వద్ద గొలుగొండ ఎస్సై రామారావు ఆధ్వర్యంలో నిర్వహించిన వాహన తనిఖీల్లో నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

నిందితుల వద్ద నుంచి 2 కిలోల హాషిష్ ఆయిల్, 2 కిలోల గంజాయి, మూడు మోటార్‌సైకిళ్లు, ఐదు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సీఐ రేవతమ్మతో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.