MahaKumbamela | రేపే కుంభమేళాకు ప్రధాని మోడీ..

న్యూ ఢిల్లీ – ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫిబ్రవరి 5న ప్రయాగ్‌రాజ్‌ మహాకుంభమేళాను సందర్శించనున్నారు. ప్రతిపాదిత షెడ్యూల్ ప్రకారం మోదీ ఉదయం 10:30 గంటలకు ఫిబ్రవరి 5న ప్రయాగరాజ్‌కు చేరుకుంటారు. ఆ క్రమంలో ప్రధాని మహాకుంభమేళాను సందర్శించే సమయంలో ప్రత్యేక పూజలతోపాటు పవిత్ర స్నానం చేయనున్నారని తెలుస్తోంది. ఆయన ప్రయాగరాజ్‌లోని అరయిల్ ఘాట్‌కు చేరుకుని, అక్కడి నుంచి గంగా, యమునా, సరస్వతి నదుల సంగమ స్థలమైన సంగం వద్ద పడవ ప్రయాణం చేస్తారు. ఆ క్రమంలో అక్కడి పవిత్ర సంగమ నదుల్లో ఆయన పవిత్ర స్నానం చేయనున్నారు.

12న అమెరికాకు…
ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 12న అమెరికా వెళ్లనున్నారు. రెండు రోజుల పాటు ఆయన అక్కడ పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా వైట్‌హౌ్‌సలో అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో ప్రధాని సమావేశమై చర్చలు జరుపుతారు. ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడయ్యాక ప్రధాని అమెరికాలో పర్యటించడం ఇదే తొలిసారి. మోదీ ఫ్రాన్స్‌ పర్యటన ముగిసిన వెంటనే అమెరికాలో పర్యటనకు వెళ్లనున్నారు. జనవరి 20న ట్రంప్‌ ప్రమాణస్వీకారం చేశాక మోదీ 27న ఆయనకు ఫోన్‌ చేసి అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *