హంద్రీనీవా కాలువలో జలహారతి..

ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం హంద్రీనీవా కాలువకు కృష్ణా జలాలను మళ్లించడంతో మండలంలోని లత్తవరం గ్రామం వద్ద ఉన్న కాలువలో శనివారం మాజీ సర్పంచ్ బోధపాటి గోవిందప్ప ఆధ్వర్యంలో గంగాపూజ నిర్వహించి జలహారతి ఇచ్చారు. ఈ సందర్భంగా అందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని లత్తవరం గ్రామంలోని ఎంపీయూపీ పాఠశాలలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి రామచంద్ర యాదవ్, ఉపాధ్యాయులు, పాఠశాల కమిటీ చైర్మన్, సచివాలయ సిబ్బంది, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.