10people | ఆరుగురు మృతి

10people | ఆరుగురు మృతి

10people | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కొప్పల తాలూకా మునీరాబాద్ సమీపంలో వెనుక నుంచి వచ్చిన లారీ ట్రాక్టర్‌ను ఢీకొనడంతో అది వంతెనపై నుంచి కిందపడింది. ఈ దుర్ఘటనలో చిన్నారి సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, మరో 10 మంది గాయపడ్డారు.

సండూరు, కూడ్లిగి తాలూకాలకు చెందిన 16మంది ట్రాక్టర్‌లో హులిగమ్మ దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. లారీ ఢీకొట్టిన ధాటికి ట్రాక్టర్ అదుపుతప్పి వంతెనపై నుంచి కిందపడిపోయింది.

ప్రమాదంలో చిన్నారి సహా ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన వారిని సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

Leave a Reply