విజయవంతంగా మోడీ పరిపాలన..
మోత్కూర్, ఆంద్రప్రభ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో 12 సంవత్సరాలు పరిపాలన విజయవంతమైన సందర్భంగా జాగృతి మాసపత్రిక ప్రత్యేక సంచిక మున్సిపాలిటీ పరిధిలో మంగళవారం మేధావులు, ప్రభుత్వ ఉద్యోగులను కలిసి మాసపత్రికను బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తుమ్మల మురళీధర్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు.ఈ సందర్భంగా మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ అంత్యోదయ సిద్ధాంతాన్ని ఆచరణలో పెట్టిన మోడీ, ప్రభుత్వం సమాజంలోని చిట్టచివరి పేద కుటుంబానికి అభివృద్ధి ఫలాలు అందించడమే మోడీ ప్రభుత్వ విధానమన్నారు.
మోడీ ప్రభుత్వంలో అనేక విప్లవాత్మకమైన సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అందుతున్నాయని, స్వచ్ఛభారత్ ,మిషన్ భగీరథ పేద మహిళల ఆత్మ గౌరవాన్ని కాపాడడానికి మరుగుదొడ్లు నిర్మించి మహిళల ఆత్మ గౌరవాన్ని కాపాడిందన్నారు. ఉజ్వల యోజన ద్వారా పేద కుటుంబాలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు అందించి పొగరహిత వంట గదులను సహకారం చేసిందన్నారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద 80 కోట్ల ప్రజలకు ఉచిత రేషన్ అందిస్తూ, ఆయుష్మాన్ భారత్ పథకం కింద రూ.5 లక్షల ఉచిత వైద్యం తో పాటు జన ఔషధ కేంద్రాల ద్వారా నాణ్యమైన మందులు అతి తక్కువ ధరలకు, రైతుల సంక్షేమ కోసం పీఎం కిసాన్ ద్వారా కోట్లాది రైతుల ఖాతాలకు ఒక్కొక్కరికి ఏడాదికి రూ.6000 లబ్ధి చేకూరుస్తూ, ప్రజల్లో డిజిటల్ పేమెంట్స్ వంటి సంస్కరణలు తీసుకువచ్చిన ఘనత మోడీ ప్రభుత్వమేనన్నారు.
దేశ భద్రత దుష్ట జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 ను రద్దు చేసి దేశ సమగ్రతను బలోపేతం చేసిందన్నారు. మౌలిక వసతుల అభివృద్ధిలో భాగంగా రహదారులు ఎక్స్ప్రెస్ వేలు, వందే భారత్, రైలు, విమానాశ్రయాలు విస్తరణ చేపట్టి భారతదేశాన్ని ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల సరసన నిలిపారన్నారు సోలార్ విద్యుత్ , గ్రీన్ ఎనర్జీ రంగాల్లో సైతం భారత్ ముందంజలో ఉందన్నారు . దశాబ్దాల కాలంగా పరిష్కారం కానీ సమస్య శ్రీరామ అయోధ్య ఆలయ నిర్మాణాన్ని సాకారం చేసి భారతీయుల ఆత్మ గౌరవాన్ని కాపాడరన్నారు. మోడీ ప్రభుత్వం గత 12 సంవత్సరాల సాధించిన విజయాలు భారతదేశంలో వికసిత్ భారత్ 2047 లక్ష్యం వైపు వేగంగా తీసుకెళ్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా బిజెపి కోశాధికారి గుజ్జ సోమనర్సయ్య,మున్సిపాలిటీ బిజెపి అధ్యక్షులు చాడ మంజుల , జిల్లా నాయకులు కొనతం నాగార్జున రెడ్డి , ఏనుగు జితేందర్ రెడ్డి, గౌరు శ్రీనివాస్ , పోచం సోమయ్య , మండల నాయకులు భీమిడి తిరుమల్ రెడ్డి,అన్నెపు సత్యనారాయణ , బద్ధం మహేందర్ రెడ్డి, జినుకల దశరథ తదితరులు పాల్గొన్నారు.
