ఇందిరమ్మ ఇంటితో పేదింటి కళ సాకారం..

ఇందిరమ్మ ఇంటితో పేదింటి కళ సాకారం..

ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం లో పాల్గొన్న ఎమ్మెల్యే సామెల్

మోత్కూర్, ఆంధ్రప్రభ : మున్సిపల్ కేంద్రంలోని ఆది నర్సింహా, బేబీ దంపతులు నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ళు గృహప్రవేశం లో ఆదివారం తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సామెల్ స్వయంగా రిబ్బన్ కట్ చేసి ఇందిరమ్మ ఇళ్లును ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే సామెల్ మాట్లాడుతూ గత ప్రభుత్వాలు పేదలకు ఇండ్ల నిర్మాణం విస్మరిస్తే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలతో పేదింటి కళ నెరవేరుస్తున్నారన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గడ్డం స్వప్న సోమనర్సయ్య, వైస్ చైర్మన్ పల్లెర్ల వెంకన్న, కౌన్సిలర్ పన్నాల శ్రీవిద్య, రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ డా గుర్రం లక్ష్మీ నర్సింహారెడ్డి, మార్కెట్ డైరెక్టర్ పన్నాల శ్రీనివాస్ రెడ్డి,మాజీ సింగిల్ విండో చైర్మన్ పేలపూడి వెంకటేశ్వర్లు,కాంగ్రెస్ నాయకులు ఎడ్ల శ్రీనివాస్, అవిశెట్టి రాజాలు, నాగరాజు,మేడబోయిన నరేశ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply