దుబాయి మృతిని కుటుంబీకులను పరామర్శించిన ఎమ్మెల్యే..

జన్నారం, ఆంధ్రప్రభ : విదేశాల్లో మృతి చెందిన మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని రేండ్లగూడకు చెందిన మంత్రి మహేష్ కుటుంబ సభ్యులను శుక్రవారం సాయంత్రం నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు,ఖానాపుర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పరామర్శించి, ఓదార్చారు. మండలంలోని బొమ్మినలో ఇటీవల చనిపోయిన కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు.

లక్ష్మీదేవి ఆలయంలో పూజలు చేసిన ఎమ్మెల్యే

నామకరణ మహోత్సవానికి హాజరై చిన్నారిని ఆశీర్వదించిన ఎమ్మెల్యే బొజ్జు

జన్నారం, ఆంధ్రప్రభ : మండలంలోని చింతగూడ గ్రామ సమీపంలో ఉన్న శ్రీ లక్ష్మీదేవి ఆలయంలో శుక్రవారం ఎమ్మెల్యే బొజ్జు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు రేండ్లగూడ పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ దంపతుల కుమారుడి నామకరణ మహోత్సవానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్నారిని ఆశీర్వదించారు.

ఈ కార్యక్రమంలో జన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్లు లక్ష్మీనారాయణ, ఫసిహుల్లా, పార్టీ మండల శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అజ్మీర నందునాయక్, మాణిక్యం, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు గుర్రం మోహన్‌రెడ్డి, నాయకులు మచ్చ శంకరయ్య, దాముక కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.