పిచ్చికుక్క దాడి.. 15 మందికి గాయాలు..
పిచ్చికుక్క దాడి.. 15 మందికి గాయాలు..
గద్వాల్ (ప్రతినిధి), ఆంధ్రప్రభ : జోగులాంబ గద్వాల్ జిల్లా: గద్వాల్ పట్టణం, జమ్మి చెడులోని 4వ వార్డ్ లో మంగళవారం రోజు ఉదయం 7.00 గంటల సమయంలో పిచ్చికుక్క 15 మంది పై దాడి చేసి కరిచింది. గాయపడిన వారు మహబూబ్ నగర్, గద్వాల ప్రభుత్వ ఆసుపత్రులకు చికిత్స కోసం వెళ్లినట్లు బంధువులు కాలనీవాసులు తెలిపారు. పిచ్చి కుక్కను చంపేందుకు గాలిస్తున్నారు కాలనీవాసులు.
గద్వాల్ జిల్లా కేంద్రంలో 15 రోజుల క్రిందట నల్లకుంట, కృష్ణవేణి చౌక్, గంజిపేటలో 20 మందిని పిచ్చికుక్క కరిచిన సంఘటన మరువకముందే మరోసారి ఈ రోజు ఉదయం జమ్మిచెడులో 15 మంది పై పిచ్చికుక్క దాడి చేసి గాయపరిచిన విషయంలో మున్సిపల్ అధికారులు, జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టాలని కాలనీవాసులు కోరుతున్నారు.
