విక్కుర్తి శ్రీనివాసరావుకు మంత్రి నిమ్మల సత్కారం…

అవనిగడ్డ నియోజకవర్గ పరిధిలోని ఇరిగేషన్, రైతాంగ సమస్యలపై …
త్వరలో సమగ్ర సమీక్ష


అవనిగడ్డ, ఆంధ్రప్రభ : రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడును అవనిగడ్డ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ విక్కుర్తి శ్రీనివాసరావు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. నూతనంగా అవనిగడ్డ నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్‌గా బాధ్యతలు చేపట్టిన విక్కుర్తి శ్రీనివాసరావును మంత్రి నిమ్మల రామానాయుడు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం విక్కుర్తి శ్రీనివాసరావును ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా అవనిగడ్డ నియోజకవర్గంలో నెలకొన్న పలు ఇరిగేషన్ సమస్యలు, రైతాంగ సమస్యలతో పాటు అభివృద్ధి పనులపై విక్కుర్తి శ్రీనివాసరావు మంత్రి నిమ్మల రామానాయుడు దృష్టికి తీసుకెళ్లారు.విక్కుర్తి శ్రీనివాసరావు వివరించిన సమస్యలపై మంత్రి నిమ్మల రామానాయుడు సానుకూలంగా స్పందించారు. త్వరలోనే అవనిగడ్డ నియోజకవర్గానికి స్వయంగా వచ్చి ఇరిగేషన్, రైతాంగ సమస్యలు మరియు అభివృద్ధి పనులపై సమగ్ర సమీక్ష నిర్వహించి, సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటానని విక్కుర్తి శ్రీనివాసరావుకు మంత్రి హామీ ఇచ్చారు.