Guntur | బైక్ ను ఢీ కొట్టిన లారీ – ఇద్దరు స్పాట్ డెడ్

గుంటూరు, ఆంధ్రప్రభ:గుంటూరు నగరంలోని అమరావతి రోడ్డు చిల్లీస్ రెస్టారెంట్ వద్ద మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. బైక్‌ను లారీ ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. గుంటూరు వైపు నుంచి గోరంట్ల వైపు వెళుతున్న బైకును ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో ఈ సంఘటన చోటుచేసుకుంది.

స్థానికుల సమాచారం మేరకు బైక్ పై ఓ వ్యక్తి వెనుక మహిళ కూర్చున్నారు. చిల్లీస్ డాబా వద్ద యూటర్న్ తీసుకునే సమయంలో ఒక్కసారిగా లారీ ఎదురుగా వచ్చి ఢీకొనడంతో ఈ సంఘటన చోటుచేసుకుంది. స్థానికులు పరిగెత్తుకుంటూ వచ్చి వారిని కాపాడేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.

సమాచారం అందుకున్న నల్ల పాడు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. నిత్యము రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో ప్రమాదం చోటు చేసుకోవడం ఒకసారి గా అక్కడి స్థానికులను ఆందోళన గురిచేసింది.

Leave a Reply