జైనాలయ మాజీ మేనేజర్ శర్మ మృతి

జైనాలయ మాజీ మేనేజర్ శర్మ మృతి
ఆలేరు,ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా కొలనుపాక లోని అంతర్జాతీయ ప్రసిద్ధి పొందిన శ్రీ శ్వేతాంబరజైన దేవాలయంలో సుదీర్ఘకాలం మేనేజర్ గా విధులు నిర్వహించిన శర్మ సోమవారం మృతి చెందారు.
జైన భక్తులతో పాటు, కొలనుపాక గ్రామస్తులకు ఆత్మీయుడైన వ్యక్తిగా పేరుపొందిన శర్మ మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు.
