KKR vs SRH | ఆఖ‌రిపోరులో టాస్ గెలిచిన స‌న్ రైజ‌ర్స్.. !

ఐపీఎల్ 2025 సీజన్‌ నెమ్మదిగా ముగింపు దశకు చేరుకుంటుంది. ఈరోజు అరుణ్ జైట్లీ స్టేడియంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడుతోంది.

ఈ సీజన్‌కి డిఫెండింగ్ ఛాంపియన్‌గా దిగిన కోల్‌కతా, గత సీజన్ రన్నరప్‌గా వచ్చిన సన్‌రైజర్స్ – ఇరుజట్లు భారీ ఆశలతో టోర్నీలోకి ప్రవేశించినా, ప్లేఆఫ్‌కు అర్హత పొందడంలో విఫలమయ్యాయి. అయితే, ఈరోజు మ్యాచ్ రెండు జట్లకు లీగ్ దశలో వారి చివరి మ్యాచ్ కావడం గమనార్హం.

కాగా, ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే, ఇప్పటికే ప్లేఆఫ్ ఆశలు గల్లంతైన నేపథ్యంలో, క‌నీసం త‌మ ఆఖ‌రి మ్యాచ్‌ను గెలిచి ఆరెంజ్ ఆర్మీకి మంచి అనుభ‌వం ఇవ్వాల‌ని సన్‌రైజర్స్ పట్టుదలగా ఉంది.

తాజాగా ఐపీఎల్ పునఃప్రారంభం తరువాత వరుసగా రెండు విజయాలతో పునరుత్తేజం పొందిన హైదరాబాద్ జట్టు, ఈరోజు కేకేఆర్‌తో మ్యాచ్‌లో విజయం సాధించి సీజన్‌ను గెలుపుతో ముగించాలనే సంకల్పంతో బరిలోకి దిగుతోంది.

ఇరుజట్లూ ఇప్పటికే ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకున్నప్పటికీ, గౌరవప్రదమైన ముగింపును అందించాలనే లక్ష్యంతో ఈ మ్యాచ్‌ను పూర్తి స్థాయిలో పోటీగా మలచేలా కనిపిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *