OG | ది ఓజీ ఈజ్ బ్యాక్.. !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఓజి’. టాలెంటెడ్ డైరెక్టర్ సుజిత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై మొదటి నుంచి అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, కొంతకాలంగా షూటింగ్ వాయిదా పడినప్పటికీ, పవన్ కళ్యాణ్ తాజా డేట్స్ ఇచ్చిన నేపథ్యంలో చిత్రీకరణ తిరిగి వేగంగా జరుగుతోంది.

తాజాగా ఈ చిత్రం విడుదల తేదీపై క్లారిటీ ఇచ్చారు చిత్ర నిర్మాతలు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ మాస్ యాక్షన్ డ్రామాను ఈ ఏడాది సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.

ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు.

Leave a Reply