Kiran abbavaram | విశ్వక్ తర్వాత కిరణ్ అబ్బవరం..

Kiran abbavaram | విశ్వక్ తర్వాత కిరణ్ అబ్బవరం..

Kiran abbavaram | హీరోలు దర్శకత్వం వైపు మళ్లుతున్నారా?
ఎన్టీఆర్ నుంచి కృష్ణ వరకు హీరోల డైరెక్షన్ ట్రెండ్
యంగ్ హీరోల్లో రైటింగ్, డైరెక్షన్ పై ఆసక్తి
విశ్వక్ సేన్ తర్వాత కిరణ్ అబ్బవరం అడుగు
కిరణ్ అబ్బవరం కెరీర్‌లో కీలక మలుపు
దర్శకుడిగా మారడం ఎంత పెద్ద సవాల్?
కిరణ్ అబ్బవరం డైరెక్షన్‌పై అంచనాలు

Kiran abbavaram | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : హీరోలు దర్శకత్వం చేయడం కొత్త కాదు. అయితే.. నాడు హీరోలు డైరెక్షన్ వైపు చూసినా.. ఆతర్వాత తరం డైరెక్షన్ వైపు చూడలేదు. అయితే.. ఇప్పుడు యంగ్ హీరోల్లో కొంత మంది.. కథలు కూడా రాసేస్తున్నారు. ఇప్పుడు డైరెక్షన్ కూడా చేసేయాలి అనుకుంటున్నారు. ఇంతకీ.. నాడు డైరెక్షన్ చేసిన హీరోలు ఎవరు..? రైటింగ్ పై దృష్టి పెట్టి కథలు (Stories) రాస్తున్న హీరోలు ఎవరు..? ఇప్పుడు కిరణ్‌ అబ్బవరం రిస్క్ చేసి ఏం చేయబోతున్నాడు..?

Kiran abbavaram

Kiran abbavaram | నాడు ఎన్టీఆర్, కృష్ణ..

నాడు ఎన్టీఆర్, కృష్ణ హీరోలుగానే కాకుండా డైరెక్షన్ కూడా చేసి మెప్పించారు. అయితే.. ఆతర్వాత జనరేషన్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌.. ఈ నలుగురు హీరోలు (Heroes) డైరెక్షన్ వైపు చూడలేదు. అయితే.. కమెడియన్స్ ధర్మవరం, ఏవిఎస్, ఎం.ఎస్. నారాయణ.. డైరెక్షన్ చేశారు. ఇప్పుడు యంగ్ హీరోల్లో కొంత మంది కథలు రాయడం.. పాటలు రాయడం.. చేస్తున్నారు. అడివి శేష్‌, సిద్దు జొన్నలగడ్డ కథలు రాస్తున్నారు. డైలాగ్స్ కూడా రాస్తున్నారు. ఎనర్జిటిక్ హీరో రామ్ ఆంధ్రా కింగ్ తాలూకా సినిమా కోసం పాట రాసారు. ఇప్పుడు తను చేయబోయే సినిమా కోసం కథ రాస్తున్నారని టాక్ వినిపిస్తోంది.

Kiran abbavaram

Kiran abbavaram | దాస్.. ధమ్కీ..

యంగ్ హీరోల్లో డైరెక్షన్ చేస్తుందంటే.. విశ్వక్ సేన్ అని చెప్పాలి. పలక్ నుమా దాస్ మూవీతో దర్శకుడిగా కూడా సక్సెస్ సాధించాడు. ఆతర్వాత ధమ్కీ మూవీకి కూడా డైరెక్షన్ చేశాడు. ఇప్పుడు కిరణ్ అబ్బవరం కూడా డైరెక్షన్ చేయబోతున్నాడని వార్తలు వస్తుండడం ఆసక్తిగా మారింది. రాజా వారు రాణి గారు మూవీతో హీరోగా కెరీర్ స్టార్ట్ చేశాడు. ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమాతో (Movie) కమర్షియల్ సక్సెస్ సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆతర్వాత సరైన కథలు ఎంచుకోకపోవడంతో వెనకబడినా క అనే డిఫరెంట్ సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు.

Kiran abbavaram

Kiran abbavaram | దర్శకుడిగా కిరణ్ అబ్బవరం..?

హీరోగా ఫామ్ లో ఉన్నప్పుడు డైరెక్షన్ చేయడం అంటే.. కత్తి మీద సామే. ఓ వైపు కథ, నిర్మాణం, డైరెక్షన్ అన్నీ చూసుకోవాలంటే చాలా అంటే చాలా ఒత్తిడి ఉంటుంది. ప్రస్తుతం కిరణ్ అబ్బవరం..(Kiran Abbavaram) చెన్నై లవ్ స్టోరీ సినిమాని పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాతో మళ్లీ బ్లాక్ బస్టర్ సాధిస్తాననే నమ్మకంతో వర్క్ చేస్తున్నాడు. కె ర్యాంప్ మూవీ సక్సెస్ అయ్యింది కానీ.. ఆశించిన స్థాయిలో అందర్నీ మెప్పించలేదు అనే టాక్ ఉంది. త్వరలోనే దర్శకుడిగా చేసే సినిమా గురించి అనౌన్స్ చేస్తాడని ప్రచారం జరుగుతుంది. మరి.. హీరోగా సక్సెస్ సాధించినట్టుగా.. దర్శకుడిగా కూడా సక్సెస్ సాధిస్తాడేమో చూడాలి.

Leave a Reply