TG | మూసీ పరిసరాల్లో నిర్మాణాలపై కీల‌క ఉత్త‌ర్వులు !

మూసీ పరిసర ప్రాంతాల్లో నిర్మాణాలను నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. మూసీ న‌దికి 50 మీటర్ల వరకు బఫర్ జోన్‌లో నిర్మాణాలను నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. మూసీ నుండి 50 నుండి 100 మీటర్ల వరకు కొత్త అనుమతులను నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

మాస్టర్ ప్లాన్ ఖరారయ్యే వరకు కొత్త అనుమతులు జారీ చేయరాదని ఉత్తర్వులో పేర్కొంది. మూసీ నది పరిసరాల్లో నిర్మాణాలను నియంత్రించడానికి రాష్ట్ర ప్రభుత్వం నలుగురు సీనియర్ అధికారులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. డీటీసీపీ, జీహెచ్​ఎంసీ చీఫ్​ ప్లానర్​, హెచ్​ఎండీఏ ప్లానింగ్​ డైరెక్టర్​తో కమిటీని ఏర్పాటు చేసింది.

కమిటీ అనుమతి ఇచ్చే వరకు కొత్త అనుమతులు ఇవ్వబోమని ప్రభుత్వం తెలిపింది. మూసీ నుండి 100 మీటర్ల వరకు ప్రభుత్వ పనులు చేప‌ట్టాల‌న్నా ముందస్తు అనుమతి తప్పనిసరి అని పేర్కొంది.

Leave a Reply