Singareni | మణుగూరు-పీకే ఓసీపీ ఎక్స్టెన్షన్…

Singareni | మణుగూరు-పీకే ఓసీపీ ఎక్స్టెన్షన్…

  • సింగరేణికి అప్పగించకుంటే అడ్డుకుంటాం
  • అదాని, మెగా కంపెనీలకు ఇస్తే అడుగుపెట్టనివ్వం
  • ఏఐటియుసి అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య

Singareni | గోదావరిఖని, ఆంధ్రప్రభ : కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న బొగ్గు బ్లాక్(Coal block)ల వేలంలో సింగరేణి బొగ్గు పరిశ్రమకు అన్యాయం చేయాలని చూస్తే సహించేది లేదని… సింగరేణి బొగ్గు పరిశ్రమను పరిరక్షించుకుంటామ‌ని ఏఐటీయూసీ అధ్యక్షుడు, సింగరేణి గుర్తింపు సంఘం నేత వాసిరెడ్డి సీతారామయ్య తెలిపారు.

ఇవాళ‌ గోదావరిఖని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వాసిరెడ్డి సీతారామయ్య మాట్లాడుతూ… మణుగూరు, పీకే ఓపెన్ ప్రాజెక్టుల ఎక్స్టెన్షన్ కు సంబంధించి సింగరేణి బొగ్గు పరిశ్రమకే అవకాశం ఇవ్వాలని వాసిరెడ్డి సీతారామయ్య డిమాండ్ చేశారు. ఓపెన్ కాస్ట్(open cast) ప్రాజెక్టుల తవ్వకాల పొడిగింపున‌కు సంబంధించి సింగరేణి పరిశ్రమకు మాత్రమే అవకాశం ఇచ్చి తీరాలని… లేదంటే అడ్డుకుంటామని హెచ్చరించారు.

సింగరేణి సంస్థ కు కాకుండా అతని మెగా కృష్ణారెడ్డి లాంటి ప్రైవేటు కంపెనీలకు బొగ్గు బ్లాక్ లను ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టుల తవ్వకాల పొడిగింపులను అప్పగించినట్లయితే ఈ ప్రాంతంలో ఆ సంస్థలను అడుగుపెట్టనివ్వమని వాసిరెడ్డి సీతారామయ్య ఈ సందర్భంగా తేల్చి చెప్పారు.

తెలంగాణ ఉద్యమ తరహాలు సింగరేణి(Singareni) సంస్థను కాపాడుకునేందుకు పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. మణుగూరు పీకే ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులను సింగరేణికి అప్పగించకపోతే యావత్తు సింగరేణి పరిశ్రమకే నష్టం జరిగే పరిస్థితి తలెత్తుతుందన్నారు. కంపెనీ మనుగడే ప్రశ్నార్థకమే పరిస్థితి ఎదురవుతుందని చెప్పారు.

గత భారత రాష్ట్ర సమితి ప్రభుత్వంతో పోల్చుకుంటే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో సింగరేణిలో రాజకీయ జోక్యం పెరిగిందన్నారు. అదేవిధంగా డీఎంఎఫ్ టి, సింగరేణి సిఎస్ఆర్ నిధులు స్థానిక ప్రాంతాలకు కాకుండా ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నాయని విమర్శించారు. భారత రాష్ట్ర(Indian state) సమితి ప్రభుత్వంకు నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం నిధుల దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపించారు.

సింగరేణి బొగ్గు పరిశ్రమను పరిరక్షించుకోవడం కోసం, బొగ్గు బ్లాక్లను సాధించుకోవడం కోసం పరిరక్షణ సమితి పేరిట అన్ని రాజకీయ పార్టీలు, అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతామని వాసిరెడ్డి సీతారామయ్య స్పష్టం చేశారు. బొగ్గు పరిశ్రమను కాపాడుకునేందుకు అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. విలేకరుల సమావేశంలో ఏఐటియుసి(AITUC) కేంద్ర ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లయ్య గౌడ్, దాసరి శ్రీనివాస్, గౌతమ్ గోవర్ధన్,రమేష్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply