కళ్యాణలక్ష్మి,షాది ముబారక్ చెక్కులు పంపిణీ..

ఉట్నూర్, ఆంధ్రప్రభ: ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో శుక్రవారం ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మొత్తం 69 మంది కళ్యాణలక్ష్మి లబ్ధిదారులకు, 5 మంది షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు.

కార్యక్రమంలో ఎమ్మెల్యే బొజ్జు పటేల్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తోందన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు.

ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాల ప్రయోజనాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఉట్నూర్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ జాదవ్ అనిత శ్రీనివాస్, ఆదిలాబాద్ డీసీసీ ఉపాధ్యక్షుడు లింగంపల్లి చంద్రయ్య, ఉట్నూర్ సహకార సంఘం చైర్మన్ సామ ప్రభాకర్ రెడ్డి, తహసీల్దార్ కోటిన రఘునాథ్ రావు, డిప్యూటీ తహసీల్దార్ అమృత్‌లాల్, మండల పంచాయతీ అధికారి సుధీర్ రెడ్డి, ఇతర అధికారులు, కాంగ్రెస్ నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Leave a Reply