గుర్తుతెలియని దుండగులు కత్తులతో దాడి..

గుర్తుతెలియని దుండగులు కత్తులతో దాడి..
వి కోట, ఆంధ్రప్రభ : చిత్తూరు జిల్లా వికోటలో దారుణం చోటుచేసుకుంది. ఆంధ్రజ్యోతి రిపోర్టర్ జగన్మోహన్ రెడ్డి పై గుర్తుతెలియని దుండగులు కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే మృతి చెందగా, ప్రజాశక్తి రిపోర్టర్‌కు గాయాలయ్యాయి. మంగళవారం ఉదయం 7.30 గంటలకు జగన్మోహన్ రెడ్డి వాకింగ్ చేస్తుండగా దుండగులు వెనుక నుండి వచ్చి కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్ర రక్తస్రావం కావడంతో జగన్మోహన్ రెడ్డి సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. ఆయనతో పాటు ఉన్న ప్రజాశక్తి రిపోర్టర్ అడ్డుకునే ప్రయత్నం చేయగా ఆయన పై కూడా దాడి చేసి గాయపరిచారు.
స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి, గాయపడిన విలేకరిని ఆసుపత్రికి పంపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. జర్నలిస్టుపై పట్టపగలే జరిగిన ఈ దాడితో పాత్రికేయ వర్గాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని జర్నలిస్టు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
