పౌర్ణమి వేళ ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ..

పౌర్ణమి వేళ ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ..

ఆదివారం ఉదయం 5.30 గంటలకు ప్రారంభం..
కామధేను అమ్మవారి ఆలయం నుంచి భక్తుల పాదయాత్ర..
పాల్గొనాలని భక్తులకు ఈవో శీనా నాయక్ పిలుపు

ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : పౌర్ణమి సందర్భంగా ఇంద్రకీలాద్రిపై గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని ఈ నెల 31వ తేదీ ఆదివారం ఉదయం 5.30 గంటలకు నిర్వహించనున్నట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్ తెలిపారు. ఘాట్ రోడ్డులోని శ్రీ కామధేను అమ్మవారి ఆలయం వద్ద నుంచి గిరి ప్రదక్షిణ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.

ఇంద్రకీలాద్రి చుట్టూ గిరి ప్రదక్షిణ చేయడం వల్ల సకల దేవతల అనుగ్రహం లభించి, భక్తులు కోరుకున్న కోరికలు నెరవేరుతాయని విశ్వాసం ఉందన్నారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఈవో శీనా నాయక్ పిలుపునిచ్చారు.

Leave a Reply