indians | శిఖరం నుంచి దిగుతూ…

indians | శిఖరం నుంచి దిగుతూ…

indians | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మౌంట్ ఎవరెస్టు శిఖరంపై విషాద ఘటన చోటుచేసుకుంది. పర్వతారోహణ పూర్తి చేసుకుని తిరిగి దిగువకు వస్తుండగా ఇద్దరు భారతీయులు ప్రాణాలు కోల్పోయినట్లు నేపాల్ అధికారులు వెల్లడించారు.

మృతులను అరుణ్ కుమార్‌, సందీప్‌గా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన అనంతరం తిరుగు ప్రయాణంలో వీరికి తీవ్ర అస్వస్థత కలిగినట్లు సమాచారం.

వారిని కాపాడేందుకు గైడ్స్ తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయిందని నేపాల్ అధికారులు వెల్లడించారు. ఈ ఘటనతో పర్వతారోహక వర్గాల్లో విషాదం నెలకొంది.

Leave a Reply