Incident | తల్లి-పిల్లల ఆత్మహత్య కేసు..

Incident | తల్లి-పిల్లల ఆత్మహత్య కేసు..

విజ‌యారెడ్డి భర్త సంచలన ఆరోపణలు
అత్త కార‌ణంగానే విజ‌యారెడ్డి మృతి
నాకు ప్రాణ హాని ఉంది : సురేంద‌ర్‌రెడ్డి

Incident | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : మూడు నెలల క్రితం పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న విజయారెడ్డి ఘటనలో కొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆమె భర్త సురేందర్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.

తన భార్య ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, ఈ ఘటన వెనుక కుట్ర ఉందని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా విజయారెడ్డి ఆత్మహత్యకు ఆమె తల్లి పుష్పలత కారణమని పేర్కొన్నారు.

భార్య మరణించిన కొద్ది రోజులకే ఆస్తుల విషయంపై గొడవలు జరిగాయని, “నువ్వు చనిపోతే ఆస్తులు ఎవరికిస్తావు” అంటూ ప్రశ్నించినట్లు తెలిపారు. అంతేకాకుండా ఇంట్లో ఉన్న బంగారం, ఆస్తి పత్రాలను కూడా తీసుకెళ్లారని ఆరోపించారు.

ఈ కేసులో కీలకంగా భావిస్తున్న సూసైడ్ నోట్‌ను మాయం చేశారని కూడా సురేందర్‌రెడ్డి ఆరోపించారు. తన ప్రాణానికి అత్త, బావమరిది నుంచి ముప్పు ఉందని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.

పిల్లలను సరిగా చూసుకోరనే భయంతోనే విజయారెడ్డి వారిని వెంట తీసుకెళ్లి ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానం వ్యక్తం చేశారు. అయితే తాము చనిపోబోతున్నామనే విషయం పిల్లలకు ముందుగా తెలియదని చెప్పారు.

ఈ ఘటనలో మెల్లగా కొత్త విషయాలు బయటకు వస్తుండటంతో కేసు మరింత మలుపు తిరుగుతోంది. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.

Leave a Reply