Horror thriller | ట్రైలర్‌తో భయపెట్టిన ‘ఈషా’

Horror thriller | ట్రైలర్‌తో భయపెట్టిన ‘ఈషా’

ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఇటీవల లిటిల్‌హార్ట్స్‌, రాజు వెడ్స్‌ రాంబాయి లాంటి సూపర్‌హిట్‌ కల్ట్‌ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన బన్నీవాస్‌, వంశీ నందిపాటి ద్వయం తాజాగా ఈషా అనే టైటిల్ తో ఓ హారర్‌ థ్రిల్లర్‌(Horror thriller)ను ప్రేక్షకుల ముందుకు తీసుకరాబోతున్నారు. వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై ఈ చిత్రాన్నిడిసెంబరు 12న థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. ఇటీవల రాజు వెడ్స్‌ రాంబాయి చిత్రంతో సూపర్‌హిట్‌ కొట్టిన అఖిల్‌రాజ్‌(Akhilraj)తో పాటు త్రిగుణ్‌ హీరోలుగా నటించిన ఈ చిత్రంలో హెబ్బాపటేల్‌ కథానాయిక. సిరి హనుమంతు, బబ్లూ, పృథ్వీరాజ్‌ ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు. శ్రీనివాస్‌ మన్నె దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం నుంచి ఇటీవల విడుదలైన గ్లింప్స్‌కు అనూహ్య స్పందన(Unexpected response) వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్‌.

Horror thriller

ఈ ట్రైలర్‌ విషయానికి వస్తే.. ఇప్పటి వరకు వచ్చిన రెగ్యులర్‌ హారర్‌ థ్రిల్లర్‌ జానర్‌లో ఇదొక ఆసక్తికరమైన పాయింట్‌తో అల్లుకున్న భయపెట్టే కథ అనిపిస్తుంది. రెగ్యులర్‌ హారర్‌ ఫార్ములా(Regular horror formula)కు భిన్నంగా ఉండేలా కనిపిస్తుంది. మీరు ఊహించని చీకటి ప్రపంచం.. మరొకటి ఉంది అని ట్రైలర్‌ ఇంట్రెస్టింగ్ గా స్టార్ట్ అవుతుంది. ఈ ట్రైలర్‌ను చూస్తుంటే ప్రేక్షకలు ఉలిక్కిపడే ట్విస్ట్‌లు పుష్కలంగా ఉన్నాయి అనే ఫీలింగ్ కలిగింది. దెయ్యాలు, ఆత్మలు లేవని బలంగా నమ్మే స్నేహితుల(Believing friends) చుట్టూ ఈ కథ తిరుగుతుంది. సైన్స్ కు, అతీంద్రియ శక్తులకు మధ్య జరిగే క్లాష్ ను ఆసక్తికరంగా మలిచారు.

Horror thriller | అంతకు మించి..

ముఖ్యంగా ఆ పాడుబడిన బంగ్లా, అక్కడ నేల మీద వేసి ఉన్న యంత్రాలు, క్షుద్ర పూజల సెటప్ సినిమాలోని మూడ్‌ని ఎలివేట్ చేశాయి. కెమెరామెన్ సంతోష్(Cameraman Santosh) లైటింగ్ వాడిన విధానం, దానికి ఆర్ఆర్ ధృవన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తోడై కొన్ని చోట్ల ఉలిక్కిపడేలా చేశాయి. సౌండ్ డిజైన్ హార్రర్ సినిమాలకు ఎంత ముఖ్యమో ఈ సినిమా సౌండ్‌ డిజైనింగ్‌ ఎగ్జాంపుల్‌గా నిలుస్తుందేమో అనిపిస్తుంది. డిసెంబర్ 12న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. ట్రైలర్ చివర్లో వచ్చే ట్విస్ట్ లు, ఫాస్ట్ కట్స్(Twists, fast cuts) సినిమా మీద ఒక క్యూరియాసిటీని అయితే క్రియేట్ చేశాయి. పక్కా హార్రర్ థ్రిల్లర్ ను చూడాలనుకునే ప్రేక్షకులకు అంతకు మించి అనేలా ఈ సినిమా ఉండబోతుందనే ఫీలింగ్ ను ట్రైలర్‌(Feeling Trailer) క్రియేట్ చేసింది. మరి.. ట్రైలర్ మెప్పించినట్టుగా.. ఈషా మూవీ కూడా మెప్పిస్తుందేమో చూడాలి.

CLICK HERE TO READ 4,500 బ్యాగేజీలు ప్రయాణికులకు అప్పగింత

CLICK HERE TO READ MORE

Leave a Reply