Hormuz Strait crisis | హార్మూజ్ జలసంధిపై ప్రపంచ ఆందోళన

Hormuz Strait crisis | హార్మూజ్ జలసంధిపై ప్రపంచ ఆందోళన
Hormuz Strait crisis | చమురు సరఫరాపై యుద్ధ ప్రభావం
అమెరికా–ఇరాన్ చర్చల తాజా పరిణామాలు
పెరుగుతున్న చమురు ధరలు, ప్రపంచ ఆర్థిక సంక్షోభం
హార్మూజ్ మూసివేతపై దేశాల వ్యూహాలు
Hormuz Strait crisis | 1967లో ఈజిప్టు యుద్ధం తర్వాత సూయెజ్ కాలువను తెరవలేదు. 15 నౌకలు లోపల ఉండిపోయాయి. యుద్ధం పూర్తి అయ్యేవరకు అవి లోపలే ఉన్నాయి. అయితే, అప్పట్లో యుద్ధం త్వరగా ముగిసింది. ఆరు రోజుల యుద్ధం తర్వాత ఆ కాలువను ఎనిమిది ఏళ్ల పాటు మూసివేశారు. 1975లో ఆ నౌకలను విడిచిపెట్టారు. రెండు మాత్రం సముద్రంలో తిరగడానికి అర్హమైనవిగా గుర్తించారు. మిగిలినవి “యెల్లో ఫ్లీట్”గా అలా ఉంచేశారు.
చరిత్ర ఎప్పుడూ ఒకేలా ఉండదు. అయితే, పాత సంఘటనలను గుర్తుకు తెస్తుంటుంది. ఇప్పుడు హార్మూజ్ జలసంధి విషయంలో అలాగే జరిగింది. అమెరికా, ఇజ్రాయెల్‌లు ఇరాన్‌పై 90 రోజుల నుంచి యుద్ధం చేస్తున్నాయి. ప్రపంచంలోని వివిధ దేశాలకు చమురు, గ్యాస్ సరఫరా హార్మూజ్ జలసంధిలో నిలిచిపోయాయి. చారిత్రక సైన్స్ ఫిక్షన్ కథలా పరిస్థితి తయారైంది.
అమెరికా, ఇరాన్‌ల మధ్య చర్చలు జరుగుతున్నాయి. పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహిస్తోంది. హార్మూజ్‌కు ప్రత్యామ్నాయంగా రెండవ పైప్‌లైన్ నిర్మాణానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రయత్నాలు చేస్తోంది. అది 2027 నాటికి పూర్తి అవుతుందని ఆశిస్తున్నారు. అయితే, ఇది ఇంకా చాలా కాలం పట్టవచ్చునని అంటున్నారు.

ఈలోగా హార్మూజ్ మార్గాన్ని వచ్చే జూలైలో తెరిచే అవకాశం ఉందంటున్నారు. ఈలోగా చమురు, గ్యాస్ ధరలు బాగా పెరిగిపోయాయి. హార్మూజ్ శాశ్వతంగా మూసివేయబడదు. అలా జరిగితే శాశ్వత నష్టం వాటిల్లుతుంది. అందువల్ల హార్మూజ్‌ను తిరిగి తెరుస్తారు. ఈ జలసంధి శాశ్వతంగా మూతపడటం వల్ల సరకుల రవాణా, ముఖ్యంగా ముడి చమురు రవాణా ఆగిపోతుంది. దీంతో ఆర్థికంగా అన్ని దేశాలకూ నష్టం వాటిల్లుతుంది. ఎస్ అండ్ పి సూచిక గరిష్ట స్థాయిలో ఇటూ అటూ ఊగుతోంది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ఈ పరిస్థితి ఎక్కువగా ప్రమాదకరంగా కనిపించడం లేదు. చౌకగానే కనిపిస్తున్నది. గ్యాస్‌లైన్ ధరలు 2022లో కన్నా తక్కువగా ఉన్నాయి. అమెరికా ఆర్థిక పరిస్థితి పరుగులు తీస్తోంది. రెండవ త్రైమాసికంలో వృద్ధి రేటు 4 శాతం పైనే ఉంది. అలాగే, ఇరాన్ ఎక్కువగా దెబ్బతినలేదు. అయితే, నిరుద్యోగం పెరిగింది. దిగ్బంధనాల వల్ల ఎగుమతులు తగ్గాయి. ఇస్లామిక్ రిపబ్లిక్ ఇటువంటి ఇబ్బందులను దాటుకుని వెళ్లగలనని నిరూపించింది.
మన దేశానికి మాత్రం ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చమురు ధరలు ఇప్పటికే నాలుగు సార్లు పెంచారు. పరిస్థితి తట్టుకోలేని రీతిలో ఉంది. గత శుక్రవారం యూఏఈకి చెందిన సీనియర్ దౌత్యవేత్త ఒకరు ప్రస్తుత యుద్ధం పరిష్కారానికి 50-50 అవకాశాలు ఉన్నాయని అన్నారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ప్రస్తుతం మన దేశంలో పర్యటిస్తున్నారు. అమెరికా, ఇరాన్ చర్చల్లో స్వల్ప పురోగతి ఉందన్నారు. ఈ చర్చలకు మధ్యవర్తిత్వం వహిస్తున్న పాక్ నాయకులు ఇస్లామాబాద్, టెహరాన్‌ల మధ్య తిరుగుతున్నారు.
అమెరికా మధ్యవర్తులు సూయెజ్ కాలువలో కన్నా ఎక్కువ సాధించవచ్చని అనుకుంటున్నారు. అయితే, హార్మూజ్ సూయెజ్ కాదు కదా! హార్మూజ్ సంక్షోభం కేవలం ఆర్థికమైనది కాదు. చమురు నిల్వలు ఖాళీ అవుతున్న కొద్దీ ఆందోళన పెరుగుతోంది. ఇప్పటి వరకు ఇంధన శాఖ హార్మూజ్ ద్వారా సరఫరా కావాల్సిన చమురు బంద్ అయినా పరిస్థితి క్షీణించకుండా చాకచక్యంగా వ్యవహరిస్తూ వచ్చింది. మార్కెట్లో బఫర్ స్టాక్ ఉండటం వల్ల మేనేజ్ చేయగలుగుతోంది.
సౌదీ అరేబియా, యూఏఈలు తమకు గల బైపాస్ లైన్ల ద్వారానూ, పెర్షియన్ గల్ఫ్ చమురు సరఫరా ద్వారానూ కొరత రాకుండా చూస్తున్నాయి. సంపన్న దేశాలు వ్యూహాత్మకంగా తమ వద్ద ఉన్న నిల్వలను ఆసరాగా తీసుకుని పరిస్థితిని నెట్టుకొస్తున్నాయి. చైనా చమురు దిగుమతులను బాగా నిలిపివేసింది. పేద దేశాల్లో మాత్రం చమురు డిమాండ్ పెరుగుతోంది.
బ్రెంట్ క్రూడ్ ధర మాత్రం బాగా పెరిగింది. అయితే, 2008, 2022 కన్నా తక్కువే. హార్మూజ్‌ను ఇంకా ఎక్కువ రోజులు మూసేస్తే పరిస్థితి మరింత దారుణంగా తయారుకావచ్చు. ఇతర దేశాల్లో ఉన్న బఫర్ స్టాకులు కూడా ఖాళీ అవుతాయి. అయితే, హార్మూజ్ ఇంకా కొంతకాలం మూసివేసినా, ఇరాన్ కొంతకాలం సంయమనం పాటించినా పరిస్థితిలో కొంత మెరుగుకావచ్చు. అయితే, ధరలు మాత్రం ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఈ రంగానికి చెందిన విశ్లేషకులు వేసిన అంచనా ప్రకారం బ్యారెల్ ధర 200 దాటవచ్చన్న విశ్లేషణ తప్పని రుజువైంది.
అయితే, హార్మూజ్ జలసంధి మరికొంతకాలం మూసివేసినా పరిస్థితిలో పెద్ద మార్పు రాకపోవచ్చు. అయితే, అమెరికాకు మిత్ర దేశాల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. ఎక్కువకాలం హార్మూజ్‌ను మూసివేయడం వల్ల ఆ దేశాలు ఎక్కువ ఇబ్బందులకు లోనవుతున్నాయి. అయితే, ట్రంప్ మాత్రం ఈ ప్రతిష్టంభన కొనసాగితే ఆర్థిక పరమైన అసౌకర్యాన్ని కలుగుతున్నట్టుగా భావించడం లేదు.
యావత్ ప్రపంచ దేశాలు హార్మూజ్ నుంచి చమురు రవాణాలో 10 నుంచి 15 శాతం కొరత కొనసాగితే నిలబడగలవా అన్న ప్రశ్న ఎదురవుతోంది. 1973, 1979లో మాదిరిగా చమురు రంగంలో మాంద్యం ఏర్పడితే పరిస్థితి ముదరవచ్చు. అయితే, కొత్త బైపాస్ లైన్లు నిర్మాణం అయితే, మధ్యప్రాచ్యంలో ఉత్పత్తులు పెరిగితే పరిస్థితి కొంత మెరుగుపడవచ్చు. 2027 నాటికి యూఏఈ తన ఎగుమతుల సామర్థ్యాన్ని రెట్టింపు చేయవచ్చు. కువైట్, ఇరాక్‌లకు మాత్రం ఇంకా కొంత సమయం పట్టవచ్చు. హార్మూజ్ దీర్ఘకాలం మూసివేస్తే ప్రపంచ దేశాల్లో చమురు సంక్షోభం ఏర్పడవచ్చు. ప్రస్తుత పరిస్థితులు చూస్తే, అటువంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం లేకపోవచ్చు.
— న్యూస్ డెస్క్
