history | అమరుల త్యాగ ఫలితమే నేటి తెలంగాణ రాష్ట్రం

history | అమరుల త్యాగ ఫలితమే నేటి తెలంగాణ రాష్ట్రం

history | మక్తల్, ఆంధ్రప్రభ : కేసీఆర్ దీక్ష అమరుల అగ ఫలితమే నేటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు(Formation of Telangana state)కు పునాది లాంటిది అని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అన్నారు. నారాయణ పేట జిల్లా మక్తల్ పట్టణంలోని తన నివాసంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో కెసిఆర్ ప్రజాస్వామ్య బద్దంగా ఉద్యమాన్ని నడిపి ఆనాటి కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మెడలు వంచి రాష్ట్ర ప్రక్రియను ప్రారంభం చేస్తున్నాం అని ప్రకటింపజేసిన చరిత్ర కేసీఆర్ కి దక్కుతుందని ఆయన కొనియాడారు.

ఆరోజు ఎంతోమంది విద్యార్థులు అమరుల అయ్యారని వారి ప్రాణ త్యాగం ఫలితంగానే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పునాది రాయి అయిందని అన్నారు. రాష్ట్రం సాధించుకున్న తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వ ఏర్పాటు చేసుకొని పదేళ్లపాటు రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం అనేక సంక్షేమం పథకాలు చేపట్టి అభివృద్ధికి ఎంతో కృషి చేసిన చరిత్ర(history) కేసీఆర్ కే దక్కుతుందన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఉన్నన్నిరోజులు కేసీఆర్ పేరు సువర్ణ అక్షరాలతో లిఖించబడుతుందని దానిని చెడిపే సత్తా ఎవరికి లేదని అన్నారు. ఆ రోజు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ విషయంలో దొంగ వైఖరి అవలంబించడం వలననే వందలాది మంది విద్యార్థులు ప్రాణాలు(lives of students) కోల్పోయే పరిస్థితి వచ్చిందని దానికి కాంగ్రెస్ పార్టీ మూల్యం చెల్లించుకోక తప్పదు అన్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ప్రజలను నిలువుగా మోసం చేసిందని తెలిపారు. 6గ్యారెంటీ(6 Guarantees)లలో ఒకటి కూడా అమలు చేయకుండా ప్రజలను మభ్యపెడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచే అభ్యర్థులకు తగిన బుద్ధి చెప్పాలని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్ రెడ్డి ఆయన పిలుపునిచ్చారు.

ఈ విలేఖరుల సమావేశంలో మాజీ మార్కెట్ కమిటీ(Market Committee) చైర్మన్ పి. నర్సింహా గౌడ్, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కొత్త శ్రీనివాస్ గుప్తా, పట్టణ అధ్యక్షుడు చిన్న హన్మంతు, ప్రధాన కార్యదర్శి అశోక్ కుమార్ గౌడ్ నాయకులు అన్వర్ హుస్సేన్ , జగ్గలి రాములు, మొగిలప్ప ,జుట్ల శంకర్, శివారెడ్డి , సాగర్ ,కుమ్మరి రవి, మన న్‌, రాజు, ఎలిగండ్ల బాలప్ప ,వినోద్, అమ్రేష్ ,నేతాజీ రెడ్డి ,ఈశ్వర్ యాదవ్, నరసింహులునాయుడు, అప్పి గౌడు, నవీన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply