Indrakeeladri | జగన్మాత సేవలో హైకోర్టు న్యాయమూర్తులు..

Indrakeeladri | జగన్మాత సేవలో హైకోర్టు న్యాయమూర్తులు..

  • కనకదుర్గమ్మ పంచహారతుల్లో పాల్గొన్న న్యాయమూర్తులు
  • ఛత్తీస్‌గఢ్ ప్రధాన న్యాయమూర్తి, హైకోర్టు న్యాయమూర్తికి అపూర్వ స్వాగతం.

ఆంధ్రప్రభ ఇంద్రకీలాద్రి : విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలోని కనకదుర్గమ్మ వారి సేవలో హైకోర్టు న్యాయమూర్తులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి హరిహర నాద శర్మ కనకదుర్గమ్మ వారి పంచహారతుల కార్యక్రమానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు.

ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తి రమేష్ కుమార్ సిన్హా అమ్మవారి దర్శనానికి విచ్చేయగా దేవస్థానం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కిషోర్ కుమార్ స్వయంగా దర్శన ఏర్పాట్లను చేశారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వీరికి వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం ప్రసాదాలను అందజేశారు.

Leave a Reply