Gudivada | గుర్తు తెలియని మృతదేహం లభ్యం

Gudivada | గుడివాడ, ఆంధ్రప్రభ : గుడివాడ బస్టాండ్ సెంటర్ వద్ద శనివారం ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం కావడం స్థానికంగా కలకలం రేపింది. టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బస్టాండ్ సెంటర్ సమీపంలో ఉన్న డ్రైనేజీ కాలువలో సుమారు 40ఏళ్ల వయస్సు గల వ్యక్తి శవమై కనిపించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి, పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.