బంగారం వ్యాపారి అదృశ్యం….!

నరసరావుపేట, ఆంధ్రప్రభ : పల్నాడు జిల్లా, నాదెండ్ల మండలం, సాతులూరు గ్రామానికి చెందిన బంగారం వ్యాపారి సాంబశివరావు (40) అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. నరసరావుపేట పట్టణం లో గోల్డ్ షాప్ నిర్వహిస్తున్న ఆయన ఈ నెల 19న విజయవాడకు వెళ్తున్నానని కారులో బయలుదేరిన తర్వాత కనిపించకుండా పోయారు. ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో కుటుంబ సభ్యులు పలుచోట్ల వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో భార్య లక్ష్మీప్రసన్న నాదెండ్ల పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసిన పోలీసులు మిస్సింగ్‌పై దర్యాప్తు ప్రారంభించారు.

Leave a Reply