కాలి బూడిదైన వడ్ల లారీ

ఇటిక్యాల, ఆంధ్రప్రభ : జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం పరిధిలో గురువారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. 44వ జాతీయ రహదారిపై వడ్ల (ధాన్యం) లోడుతో వెళ్తున్న ఓ లారీ ప్రమాదవశాత్తు నిప్పంటుకుని పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో లారీతో పాటు అందులో ఉన్న ధాన్యం కాలి బూడిదైనట్లు తెలుస్తోంది. షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయా లేక మరేదైనా కారణం ఉందా అన్న పూర్తి వివరాలు, అలాగే ఆస్తి నష్టం అంచనా తదితర విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply