బిఆర్ఎఎస్ అభ్యర్థులను గెలిపించండి..
బిఆర్ఎఎస్ అభ్యర్థులను గెలిపించండి..
ఇంటింటి ప్రచారంతో ప్రజల్లోకి చల్లా ధర్మారెడ్డి
పరకాల, ఫిబ్రవరి 7 (ఆంధ్రప్రభ): పరకాల మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పట్టణంలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకుని బిఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతు తెలుపుతూ కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇచ్చిన హామీలు అమలు కాకపోవడం, అభివృద్ధి లోపాలపై ప్రజలకు వివరించారు. మున్సిపాలిటీ అభివృద్ధి, ప్రజల సంక్షేమం బిఆర్ఎస్‌తోనే సాధ్యమని స్పష్టం చేశారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించి పట్టణ అభివృద్ధికి తోడ్పడాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఇంటింటి ప్రచార కార్యక్రమంలో పరకాల మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డు అభ్యర్థి దుంపేటి నాగరాజు,9వ వార్డు అభ్యర్థి బండారి కృష్ణ కవిత,10వ వార్డు అభ్యర్థి పిట్ట స్వప్న దేవేందర్, 11వ వార్డ్ అభ్యర్థి మార్త విక్రమ్, వివిధ వార్డుల బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, యూత్ నాయకులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
