ఐదేళ్ల చిన్నారికి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు..

మెదక్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : ఐదేళ్ల చిన్నారికి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో చోటుదక్కింది. మెదక్ జిల్లా కేంద్రంలోని దాయర వీధికి చెందిన ఎర్ర ప్రసాద్ ఐదేళ్ల కూతురు ఎర్ర ప్రాణ్య గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాదించింది. ఫిబ్రవరి 2న హైదరాబాద్ లో నిర్వహించిన కీబోర్డు ప్రతిభ పోటీల్లో పాల్గొని గంట పాటు కీబోర్డును ఆపకుండా వాయిస్తూ రికార్డు సృష్టించారు. ఈ పోటీల్లో 22 దేశాల నుంచి 2000 మంది కీబోర్డ్ వాయిద్యా కారులు పాల్గొన్నారు. ఇందులో ప్రతిభ చూపిన 777 మందికి రికార్డుల్లో చోటు లభించింది. శుక్రవారం గచ్చిబౌలిలోని విక్టరీ ఆడిటోరియంలో చిన్నారి ప్రాణ్యాకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికెట్ ను అందజేశారు.

Leave a Reply