Srisailam Politics | శ్రీశైలం రాజకీయాల్లో కొత్త రగడ
Srisailam Politics | శ్రీశైలం రాజకీయాల్లో కొత్త రగడ
Srisailam Politics | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : శ్రీశైలం క్షేత్రంలో అవినీతి అంశంపై ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డికి మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి బహిరంగ సవాల్ విసిరారు. ఆలయ వ్యవహారాల్లో అవినీతి జరిగిందని ఆరోపించిన ఆయన, ఈ అంశంపై బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటించారు. అవసరమైతే శ్రీశైలం ఆలయంలోనే ప్రమాణం చేద్దామని ఎమ్మెల్యే బుడ్డాను సవాల్ చేశారు.
‘నేను ప్రమాణం చేస్తా.. మీరు చేస్తారా?’
తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని శ్రీశైలం దేవస్థానంలో ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నానని శిల్పా చక్రపాణిరెడ్డి అన్నారు. అదే విధంగా ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి కూడా ప్రమాణం చేయగలరా అని ప్రశ్నించారు. క్షేత్రంలో జరుగుతున్న వ్యవహారాలపై ప్రజల ముందు నిజాలు బయటపెట్టేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు.
బూతులు మాట్లాడితే విశ్వరూపం చూపిస్తా…
శ్రీశైలం క్షేత్రంలో ఎమ్మెల్యే బుడ్డా అడ్డగోలుగా దోపిడీ చేస్తున్నారని శిల్పా తీవ్ర ఆరోపణలు చేశారు. తనపై వ్యక్తిగత విమర్శలు, అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు. మరోసారి బూతులు మాట్లాడితే తన విశ్వరూపం చూపిస్తానని ఘాటుగా స్పందించారు. ఈ వ్యాఖ్యలతో నంద్యాల జిల్లా రాజకీయాల్లో మరోసారి వేడి రాజుకుంది.
