విద్యార్థిని చితకబాదిన సంఘటనపై విచారణ
- ఉపాధ్యాయురాలిది తప్పులేదని నిర్ధారణ
- ఉన్నతాధికారులకు నివేధిక అందిస్తాం: కాంప్లెక్స్ హెచ్ఎం
- సర్పంచ్ ఆధ్వర్యంలో పాఠశాలలో వివరాల సేకరణ
- పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదును వెనక్కి తీసుకున్న తండ్రి
తాండూరు రూరల్, ఆంధ్రప్రభ : విద్యార్థిని చితకబాదిన సంఘటనపై విచారణ చేపట్టారు. తాండూరు మండలం కరణ్ కోట్ గ్రామ పాఠశాలలో విద్యార్థి బూమర్ తిన్నాడని టీచర్ దాడి చేయడంతో గాయాల పాలైన సంఘటన వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. సోమవారం జిల్లా అధికారుల ఆదేశాల మేరకు జెడ్పీహెచ్ఎస్ కాంప్లెక్స్ హెచ్ఎం హేమలత గాయపడిన విద్యార్థి తల్లి, నాన్నమ్మతో ప్రత్యేకంగా విచారణ చేపట్టారు. విచారణలో 4వ తరగతి చదువుతున్న మణికంఠను మాట్లాడి వివరాలు సేకరించారు. బూమర్ తింటుండగా గమనించిన టీచర్ కొడతారనే భయంతో పక్కకు జరగడంతో గోడ తగలడంతో చిన్నపాటి గాయమైనట్లు వివరించాడు.

ఆ తరువాత మధ్యాహ్నం సమయంలో స్కూల్ ఆవరణలో ఉన్న మట్టి కుప్పలపై ఆడుకుంటుండగా కిందపడి చేతికి గాయాలయ్యాయని తెలిపాడు. ప్రాథమిక చికిత్స చేయించారని, దాంతో విషయం పెద్దది అయ్యిందని తెలిపాడు. విద్యార్థితో పాటు తల్లి. నాన్నమ్మను కూడా ఆడిగి వివరాలు తెలుసుకున్నారు. తన భర్తను వద్దని చెప్పినా కూడా వినయకుండా కరణ్ కోట్ పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిపారు.
ఇదే విషయంపై గ్రామ సర్పంచ్ మైలారం రాజ్ కుమార్, మాజీ సర్పంచ్ శివకుమార్. హెచ్ఎం భారీ, వార్డు సభ్యులు క్రిష, గ్రామ నేతలు సుధాకర్, స్థానిక ఉపాధ్యాయులు దస్తప్ప, శివకుమార్, విచారణ అధికారి హేమలత విచారణలో పాల్గొన్నారు. ఈ నివేధికను ఉన్నాధికారులకు అందిస్తామని విచారణ అధికారి హేమలత తెలిపారు. మరోవైపు కరణ్ కోట్ ఎస్ఐ రాథోడ్ వినోద్ను వివరణ కోరగా విద్యార్థి తండ్రి పాండు ఇచ్చిన ఫిర్యాదును వెనక్కి తీసుకున్నట్లు తెలిపారు.
