sarees| ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ..

sarees| కాటారం, ఆంధ్రప్రభ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం బయ్యారం గ్రామంలో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలోని (In the village) మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేద కుటుంబాల మహిళలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని మహిళలు (women) ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాటారం వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చెర్మన్ చినాల బ్రహ్మరెడ్డి(Chinala Brahma Reddy), పంచాయతీ కార్యదర్శి లక్ష్మి, ఐకెపి వివో ఏ స్వప్న, కాంగ్రెస్ నాయకుడు జాగిరి శ్రీనివాస్ గౌడ్, జాగిరి రాజబాబు గౌడ్, ఇనుగాల లింగయ్య, ఐలి శ్రీనివాస్, మహిళలు పాల్గొన్నారు.
