ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా జైల్‌భరో
కార్మిక, కర్షక, ప్రజా సమస్యలను పరిష్కరించాలంటూ ఆందోళన
పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ పెద్దపల్లిలో సోమవారం జైల్‌భరో కార్యక్రమం నిర్వహించారు.
సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి సీపెల్లి రవీందర్ ఆధ్వర్యంలో వ్యవసాయ మార్కెట్ నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం రాస్తారోకో చేపట్టారు.
కార్మికులు, కర్షకులు, ప్రజల సమస్యలను పట్టించుకోకుండా ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ ఆందోళనకారులు నినాదాలు చేశారు.
