Dharmapuri | వైభవంగా అయ్యప్ప ఆలయ వార్షికోత్సవం

Dharmapuri | వైభవంగా అయ్యప్ప ఆలయ వార్షికోత్సవం

పాల్గొన్న మంత్రి అడ్లూరి


Dharmapuri | ధర్మపురి, ఆంధ్రప్రభ : ధర్మపురి (Dharmapuri) పట్టణంలోని శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో శనివారం 19వ వార్షికోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉదయం మేళతాళాలతో అయ్యప్ప శరణుగోశతో అయ్యప్ప ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా గోదావరి నదికి తీసుకువెళ్లి ఆరట్టు ఉత్సవం వైభవంగా నిర్వహించారు.

అనంతరం స్థానిక అయ్యప్ప స్వామి ఆలయం (Ayyappa Swamy Temple) లో మూల విరాట్ కు పంచామృతాలతో వివిధ పనుల రసాలతో అభిషేకం తదితర పూజలు నిర్వహించారు. అనంతరం అయ్యప్ప స్వామి 18 మెట్ల పడిపూజ వైభవంగా నిర్వహించారు. అయ్యప్ప స్వాములు ఆలపించిన పలు భక్తి గీతాలు భక్తులను ఆకట్టుకున్నాయి. తెలంగాణ రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (Adluri Laxman Kumar) స్వామి వారిని దర్శించుకొని పడిపూజలో ఉత్సవాల్లో భాగస్వాములు అయినారు ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపకులు భీమనాతిని అశోక్ మంగ గురుస్వాములు పెండ్యాల బాలకృష్ణ, కసోజ్జల రాజేశ్, జనార్దన్, అయ్యప్ప స్వామి దీక్ష పరులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply