రైతు బజార్ లో అభివృద్ధి పనులకి శ్రీకారం..

రైతు బజార్ లో అభివృద్ధి పనులకి శ్రీకారం..

వికారాబాద్ రూరల్, ఆంధ్రప్రభ : వికారాబాద్ జిల్లా కేంద్రంలోని రైతు బజార్ లో గత బీఆర్ ఎస్ ప్రభుత్వం ఇంటిగ్రీటెడ్ మార్కెట్ నిర్మాణం కోసం రైతులు కనీస అవసరలా శానిటేషన్, నీటి వసతుల తొలగించడం వలన రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు మార్లు ఆంధ్రప్రభ కథనలా ద్వారా జిల్లా కలెక్టర్ దృష్టిలోకి తీసుకోని రావడం చేత గత కలెక్టర్ ప్రతిక్ జైన్ స్పందించి ఆగిపోయిన ఇంటిగ్రెటెడ్ పనులు వికారాబాద్ మార్కెట్ చైర్మన్ చాపల శ్రీనివాస్, వైస్ చైర్మన్ మల్లేశంతో కలసి పరిశీలించారు.

ఆయన బదిలీ ముందు ఇక్కడ తాత్కాలిక అభివృద్ధి పనులను పంచాయతీ రాజ్ శాఖ ద్వారా రూ 8.60 లక్షలతో అభివృద్ధి పనులు ప్రారంభించాలని అధికారులకి ఆదేశాలు జారీ చేసారు. అధికారుల అంచనా మేరా ప్రస్తుత కలెక్టర్ దీపక్ తివారి రైతు బజార్ లో తాత్కాలిక అభివృద్ధి పనులకి ఆమోదం తెలుపడంతో రైతుల కనీస అవసరాల నిమిత్తం బోర్, పురుషులు, మహిళాల కోసం మరుగుదొడ్లు నిర్మాణం కోసం మార్కెట్ వైస్ చైర్మన్ మల్లేశం, మార్కెట్ కార్యదర్శి వెంకటేశ్వర్ రెడ్డి, సూపర్ వైజర్ ఆనంద్ కుమార్ తో కలసి శుక్రవారం బోర్ పనులను ప్రారంభించారు.

Leave a Reply