నకిలీ విత్తనాలపై షేక్షావల్లి ఉక్కు పాదం..

నకిలీ విత్తనాలపై షేక్షావల్లి ఉక్కు పాదం..

కొరడా ఝుళిపించిన ఏవో షేక్షావలి
ఒక్క వారంలోనే 54.18 లక్షల సీజర్ 6 ఏ కేసులు
నిబంధనలో అతిక్రమిస్తే క్రిమినల్ కేసు నమోదు లైసెన్సులు రద్దు, జైలు ఖాయం హెచ్చరిక
ఆంధ్ర‌ప్ర‌భ ఎఫెక్ట్…

నందికొట్కూరు, ఆంధ్రప్రభ : దాడులు తూతామంత్రం… శిక్షలు శూన్యం అంటూ వచ్చిన వార్తకు మండల వ్యవసాయ శాఖ అధికారి షేక్షావల్లి ఉక్కు పాదం మోపారు. గురువారం ఆంధ్రప్రభతో ప్రత్యేకంగా ఆయన మాట్లాడుతూ.. నకిలీ విత్తనాలు ఎరువుల మాఫియాపై కొరడా ఝుళిపించి కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన స్పష్టం చేశారు.ఈ వారం నందికొట్కూరు పట్టణంలో ఏవో షేక్షావలి ఆధ్వర్యంలో నిర్వహించిన సోదాల్లో భారీగా నకిలీ సరుకు బయటపడింది అని అన్నారు.

మొత్తం 54,18,485 విలువైన విత్తనాలు ఎరువులు సీజ్ చేసి 6 ఏ కేసులు క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. నందికొట్కూరు పట్టణంలో నిబంధనలోకి శ్రీ పల్లవి హెబ్రీ సైడ్స్ నందు 4,50,000 విలువైన విత్తన స్టాక్ అమ్మకాలు నిలుపుదల చేయడం జరిగింది. అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర ఏజెన్సీస్ నందు 14,77,300 విలువైన మొక్కజొన్న విత్తనాలను సీజ్ చేసి 6 ఏ కేసు నమోదు చేయడం జరిగింది అని తెలిపారు. మరొక షాపు రాయలసీమ ఏజెన్సీస్ నందు 8,97,840 విలువైన మొక్కజొన్న విత్తనాలను సీజ్ చేసి 6 ఏ కేసు నమోదు చేయడం జరిగింది.

ఎరువుల అక్రమాలపై కొరడా ఝళిపించారు శ్రీలక్ష్మి ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ నందు 1,00,950 విలువైన ఎరువుల అమ్మకాలు నిలుపుదల చేయడం జరిగింది.మల్లికార్జున ఏజెన్సీస్ నందు 7,94,000 విలువైన ఎరువుల అమ్మకాలు నిలుపుదల చేయడం జరిగింది.శ్రీ లక్ష్మీనరసింహ ఫర్టిలైజర్స్ మరియు పెస్టిసైడ్స్ నందు 15,98,845 విలువైన ఎరువుల అమ్మకాలు నిలుపుదల చేయడం జరిగింది అని అన్నారు.బోయ రామాంజనేయులు, కర్నూలు చెందిన వ్యక్తిపై అక్రమంగా హిట్ పత్తి విత్తనాలు నిల్వలు చేసినందుకు క్రిమినల్ కేసు పెట్టడం జరిగింది అని తెలిపారు. షాప్ యజమానులకు వ్యవసాయ అధికారి షేక్షావలి అధికారులు దాడులు చేసి చేతులు దులుపుకుంటారనేది అవాస్తవం. మేం కేవలం స్టాక్ సీజ్ తో ఆగలేదు. సిక్స్ ఏ కేసులు నమోదు చేశాం, క్రిమినల్ కేసు కూడా పెట్టాం అని ఆయన తెలిపారు. నకిలీ విత్తనాలు, ఎరువులు అమ్మిన ప్రతి వ్యాపారిపై ఉక్కు పాదంమోపుతాం అన్నారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కొరడా దెబ్బ తప్పదు అని అన్నారు. సీడ్స్ కంట్రోల్ ఆర్డర్ 1983 ప్రకారం లైసెన్స్ శాశ్వత రద్దుతో పాటు ఏడాది జైలు భారీ జరిమానా విధిస్తాం అని షేక్షావల్లి హెచ్చరించారు. రైతులకు ప్రత్యేకమైన సూచనలు వ్యవసాయ అధికారుల ద్వారా తీసుకోవాలని అన్నారు రైతులు బిల్లు తీసుకోకుండా, ప్యాకెట్ తెరవకుండా ఎవరూ విత్తనాలు కొనవద్దు. మోసపోతే వెంటనే వ్యవసాయ శాఖ కార్యాలయానికి ఫిర్యాదు చేయండి అని అన్నారు. మీ సమస్యపై ఉక్కు పాదంతో చర్యలు తీసుకుంటాం అని తెలిపారు. గత వార్తలో వచ్చిన విమర్శలకు ఇదే తమ సమాధానమని, దాడులు కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు.

Leave a Reply