వేగవంతంగా నేవీ రాడార్ పనులు..

వేగవంతంగా నేవీ రాడార్ పనులు..

వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్ జిల్లాలో నేవీ రాడార్ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. రక్షణ శాఖ ఆధ్వర్యంలో నేవీ రాడార్ పనులు అత్యంత వేగవంతంగా కొనసాగుతున్నాయి. రాడార్ కేంద్రం చుట్టూ రోడ్డు వేయడంతో పాటు అడవికి సంరక్షణగా కంచె ఏర్పాటు చేశారు. దామగుండం దేవాలయానికి ప్రత్యేక స్థలాన్ని ఉంచి ఆలయం చుట్టూ రోడ్డు వేస్తున్నారు. రాడో కేంద్రం ఏర్పాటుతో నూతన టౌన్షిప్ ఇక్కడ ఏర్పాటు కానుంది.

వికారాబాద్ జిల్లా కేంద్రానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ నేవీ కేంద్రం ఏర్పాటు ద్వారా ఈ ప్రాంతంలో నూతన టౌన్షిప్ ఏర్పాటై ఈ ప్రాంత వాసులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. రాడార్ సిబ్బంది కోసం ప్రత్యేకంగా పాఠశాల, కళాశాల ఏర్పాటు కానున్నాయి. వీటిలో స్థానికులకు కొంత శాతం రిజర్వేషన్ కల్పించనున్నారు. మొదట రాడార్ కేంద్రాన్ని వ్యతిరేకించిన ఈ ప్రాంత ప్రజలు ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధిని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కాబోయే రెండు సంవత్సరాల్లో ఈ నేవీ ఆర్డర్ పూర్తి స్థాయిలో ఏర్పాటై ఈ ప్రాంతం అభివృద్ధి దిశగా ముందుకు సాగనుంది.

Leave a Reply