Court | ఏడుగురికి 7ఏళ్ల జైలు

Court | ఏడుగురికి 7ఏళ్ల జైలు

Court | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క : బెంగళూరులో సంచలనం రేపిన జైల్లో ఉగ్రవాదం వ్యాప్తి కేసులో ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ప్రధాన నిందితుడితో పాటు ఏడుగురికి కఠిన కారాగార శిక్ష విధించింది.

బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఉగ్రవాద కార్యకలాపాలు సాగించిన కేసులో ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు ఏడుగురికి ఏడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. లష్కరే తొయిబా ఉగ్రవాది, ఈ కేసులో మాస్టర్‌మైండ్‌గా భావిస్తున్న నసీర్ కూడా శిక్షకు గురయ్యాడు.

అంతేకాకుండా, ప్రతి నిందితుడికి రూ.48,000 జరిమానా విధించింది. ఈ కేసులో ఎన్‌ఐఏ దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. జైళ్లలో ఉన్న అమాయక ఖైదీలను ఉగ్రకార్యకలాపాలకు ఆకర్షించడం, వారికి శిక్షణ ఇవ్వడం, మతమార్పిడి చేయడం వంటి కుట్రను నిందితులు పన్నినట్లు ఎన్‌ఐఏ వెల్లడించింది. ఈ తీర్పుతో జైళ్లలో ఉగ్రవాద వ్యాప్తిపై అధికార యంత్రాంగం మరింత అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారు.

Leave a Reply