తారకాచార్యులకు ప్రత్యేక అభినందనలు..

అభినందించిన ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్

భవానిపురం, ఆంధ్రప్రభ : తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని వెంకటేశ్వర వేదిక్ యూనివర్సిటీ నుండి పాంచరాత్రాగమము వార్షిక పరీక్షలలో యూనివర్సిటీ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన తారకచార్యులను పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ అభినందించి దుశ్శాలువతో సత్కరించారు. విజయవాడ చెరువు సెంటర్ కు చెందిన తారకాచార్యులు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని శ్రీ వెంకటేశ్వర వేదిక్ యూనివర్సిటీ నల్గొండ నందు జరిగిన వార్షిక పరీక్షల్లో 600 మార్కులకు గాను 532 మార్కులు సాధించి యూనివర్సిటీ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచారు.

తారకచార్యులు మంగళవారం భవానిపురం ఎన్డీఏ కార్యాలయానికి విచ్చేయగా ప్రత్తిపాటి శ్రీధర్ దుశ్శాలువతో సత్కరించి అభినందించారు. భవిష్యత్తులో తారకాచార్యులు మరింత ఉన్నత స్థానానికి ఎదగాలని ప్రత్తిపాటి శ్రీధర్ ఆకాంక్షించారు.దుర్గమ్మ గుడి ట్రస్ట్ బోర్డు మెంబర్ అవ్వారు శ్రీనివాసరావు హెచ్ బీ కాలనీ 300,450 ఎస్ ఎఫ్ టి ఫ్లాట్స్ ఓనర్స్ అసోసియేషన్ గౌరవ సలహాదారు ఎస్పీ శేషగిరిరావు, టి పూర్ణయ్య, పీ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.