కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

విజయవాడ (ఆంధ్రప్రభ): కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విజయవాడ నగరంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు, ఏఐసీసీ సభ్యుడు నరహరిశెట్టి నరసింహారావు నగరంలోని పలు ప్రాంతాల్లో జరిగిన వేడుకల్లో పాల్గొని జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని వన్‌టౌన్ అమ్మ హోటల్ సెంటర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి అనంతరం చిన్నారులకు స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో మామిడాల రమణ, మోహన్ యాదవ్, తిరుమలశెట్టి శ్రీనివాస్, సిద్ధయ్య చౌదరి, భువనగిరి రాజేష్, కన్నా తదితరులు పాల్గొన్నారు.

అనంతరం కాళేశ్వరరావు మార్కెట్ సెంటర్‌లో సెవెన్ సీటర్స్ ఓనర్స్ అండ్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు నరహరిశెట్టి నరసింహారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అసోసియేషన్ ప్రతినిధులతో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జెండాకు సెల్యూట్ చేశారు. దేశ స్వాతంత్ర్యం కోసం త్యాగాలు చేసిన జాతీయ నాయకులకు నివాళులర్పించారు. అనంతరం స్థానిక ప్రజలు, పాదచారులకు మిఠాయిలు, పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్, కాంగ్రెస్ నాయకులు వి. వెంకటేశ్వరరావు, కార్యదర్శి రమణ, కోశాధికారి రాజు, జాయింట్ సెక్రటరీ సిద్ధయ్య, రాజేష్ ఖన్నా, డి. నాగేశ్వరరావు, జే. వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.