మేడారం చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

తాడ్వాయి, ఆంధ్రప్రభ : ప్రత్యేక హెలికాప్టర్‌లో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మేడారం చేరుకున్నారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి మంత్రులు ధనసరి అనసూయ సీతక్క, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పుష్పగుచ్ఛాలు అందజేసి సాదర స్వాగతం పలికారు. ముఖ్యమంత్రికి మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు, అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు స్వాగతం పలికారు.

పంచాయతీరాజ్ కమిషనర్, సెర్ప్ సీఈవో దివ్య రాజన్, జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావు, జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, ఐటీడీఏ పీవో లెనిన్ వస్సల్ టోప్పో, భూపాలపల్లి ఎస్పీ సంకీర్త్, ఏటూరునాగారం ఏఎస్పీ మనన్ భట్ తదితరులు ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమ్మక్క–సారలమ్మ వనదేవతల దర్శనానికి బయలుదేరారు.