మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేత..
దండేపల్లి, ఆంధ్రప్రభ : దండేపల్లి మండలంలోని చింతపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు, మాజీ ఎంపీపీ గడ్డం శ్రీనివాస్ ఆదివారం విస్తృతంగా పర్యటించారు. గ్రామంలో ఇటీవల వివిధ కారణాలతో మృతిచెందిన, అనారోగ్యానికి గురైన, ప్రమాదాల్లో గాయపడిన పలువురు బాధిత కుటుంబాలను ఆయన స్వయంగా కలిసి పరామర్శించారు.
గ్రామానికి చెందిన రామగిరి పోచయ్య, వెళగందుల లక్ష్మి ఇటీవల మృతిచెందడంతో వారి కుటుంబ సభ్యులను గడ్డం శ్రీనివాస్, సుష్మ దంపతులు పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేశారు.
అనంతరం ఇటీవల కుక్కకాటుకు గురై ఇంటి వద్ద చికిత్స పొందుతున్న అవునూరి పోచయ్య, మల్యాల రాజేష్‌లను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అలాగే బైక్‌పై నుంచి కిందపడి గాయాలపాలై విశ్రాంతి తీసుకుంటున్న అవునూరి సత్తయ్యను పరామర్శించి ధైర్యం చెప్పారు.
ఈ సందర్భంగా గడ్డం శ్రీనివాస్ మాట్లాడుతూ 2007 సంవత్సరం నుంచి చింతపల్లి గ్రామంలో జరిగే శుభకార్యాలు, ఇతర సామాజిక కార్యక్రమాల్లో తనవంతు సహాయ సహకారాలు అందిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులోనూ పేదలు, ఆపదలో ఉన్న కుటుంబాలకు తనవంతు సహాయం అందిస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
