డార్మెటరీ పనులను పరిశీలించిన అదనపు కలెక్టర్..
- కిష్టాపూర్ కేజీబీవీ లో జరుగుతున్న అభివృద్ధి పనులు..
- విద్యార్థుల తల్లిదండ్రులతో..
జన్నారం,ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని కిష్టాపూర్ గ్రామ సమీపాన ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో రూ. 50 లక్షలతో జరుగుతున్న డార్మెటరీ, మూత్రశాలలు,సెప్టిక్ ట్యాంకు పనులను జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక పరిపాలన) చంద్రయ్య పరిశీలించారు. ఆదివారం మధ్యాహ్నం ఇక్కడికి వచ్చిన ఆయన జరుగుతున్న ఆ పనులను పరిశీలించి, త్వరితగతిన పూర్తి చేయాలని ఫోన్లో కాంట్రాక్టర్ ను ఆదేశించారు.

ఆదివారం కావడంతో విద్యార్థులను పలకరించడానికి వచ్చిన తల్లిదండ్రులతోనూ, విద్యార్థులతోనూ భోజనం బాగా ఉందా? అని ఆయన ప్రశ్నించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, తల్లిదండ్రులు సమాధానం ఇస్తూ, చికెన్ కూరతో భోజనం రుచికరంగా ఉందని చెప్పారు.వంటశాలను ఆయన పరిశీలించారు. ప్రస్తుతం ఉన్న 4 సిలిండర్లు సరిపోవడం లేదని అదనంగా మరో 4 సిలిండర్లు కావాలని స్థానిక కేజీబీవీ ప్రత్యేక అధికారిణి ఎం.శ్రీవాణి అదనపు కలెక్టర్ కు విన్నవించారు. ఆయన వెంట స్థానిక ఎంఈఓ బానావత్ రాజేందర్, స్థానిక సర్పంచి వాసాల నరేష్, టీచర్లు ఉన్నారు.
