కలిదిండికి సీఎం చంద్రబాబు…

మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారుల ఘన స్వాగతం


కలిదిండి / ఏలూరు బ్యూరో, ఆగస్టు 10: కలిదిండి మండలం కలిదిండి గ్రామంలో ఇవాళ రాజముద్రతో పొందుపరిచిన పట్టాదారుపాసు పుస్తకాలు పంపిణీ కార్యక్రమానికి ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి రాష్ట్ర మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు ఘనస్వాగతం పలికారు. ముందుగా జిల్లా ఇంచార్చ్ మంత్రి, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాలు శాఖ మంత్రి కొలుసు పార్థసారధి, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ లు పూలమొక్కలను అందించి రాష్ట్ర ముఖ్యమంత్రికి సాదరంగా ఆహ్వానం పలికారు.

ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త పెందుర్తి వెంకటేశ్వరరావు, ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ, ఎమ్మెల్యేలు బడేటి రాధాకృష్ణయ్య (చంటి), డా.కామినేని శ్రీనివాస్, చింతమనేని ప్రభాకర్, పత్సమట్ల ధర్మరాజు, సొంగా రోషన్ కుమార్, వెనిగండ్ల రాము, జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి, ఐజి జి.వి.జి.అశోక్ కుమార్, ఎస్పీ కె.ప్రతాప్ శివకిషోర్, అసిస్టెంట్ కలెక్టర్ సి.హెచ్.శ్రావణ్ కుమార్ రెడ్డి, జిల్లా అటవీశాఖ అధికారి పి.వి.సంధీఫ్ రెడ్డి, ఏపి అప్కాబ్ ఛైర్మన్ గన్ని వీరాంజనేయులు, ఏపీ ఐఐసి చైర్మన్ మంతెన రామరాజు, ఉమ్మడి జిల్లా గ్రంథాలయ అధ్యక్షులు జుత్తుగ నాగరాజు, మాజీ శాసనమండలి సభ్యులు కమ్మిలి విఠల్ రావు, మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళీరామకృష్ణ లు ప్రభృతులు ముఖ్యమంత్రికి పూలమొక్కలు అందించి స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతీ ఒక్కరినీ పేరుపేరున పలకరించారు.