Irumudi | ఈ సారి బ్లాక్ బస్టరే !!
Irumudi | ఈ సారి బ్లాక్ బస్టరే !!
- ఇరుముడితో రవితేజ నుంచి ఫ్యామిలీ ట్రీట్.. !
ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : రవితేజ సినిమా అంటే సాధారణంగా ఎనర్జీ, మాస్ డైలాగ్స్, కమర్షియల్ ఎలిమెంట్స్ గుర్తుకు వస్తాయి. కానీ ‘ఇరుముడి’ గ్లింప్స్ చూస్తుంటే ఈసారి ఆయన తన రొటీన్ ట్రాక్ నుంచి కాస్త పక్కకు వెళ్లి, ఫ్యామిలీ ఆడియన్స్‌కు దగ్గరయ్యే కథను ఎంచుకున్నట్టుగా అనిపిస్తోంది. శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్నట్లు ఇప్పటికే సమాచారం ఉంది. ముఖ్యంగా తండ్రి–కూతురు ఎమోషన్ ఈ కథలో కీలకంగా ఉండబోతుందని గ్లింప్స్ చూస్తే అర్థమైపోతుంది.
‘ఇరుముడి’ అనే టైటిల్లోనే ఆధ్యాత్మిక టచ్ ఉన్నా, ఇది కేవలం భక్తి నేపథ్యంలో మాత్రమే సాగే కథలా కనిపించడం లేదు. అయ్యప్ప మాల అంశం రవితేజ పాత్రలో ఒక లేయర్ మాత్రమేనని, అసలు కథలో భావోద్వేగాలకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని దర్శకుడు శివ నిర్వాణ చెప్పాలనుకున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. మాస్ మహారాజా ఈసారి మాస్‌తో పాటు మనసును కూడా తాకే ప్రయత్నం చేస్తున్నారనే భావన గ్లింప్స్‌లో స్పష్టంగా కనిపిస్తోంది.
